‘వకీల్ సాబ్’ నటి నివేదా థామస్ కరోనా పాజిటివ్.

కరోనాతో గత సంవత్సరం ప్రజలు ఎటువంటి ఇబ్బందులను ఫేస్ చేశారో తెలియంది కాదు. కరోనా కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఇక సినిమా ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. షూటింగ్స్ లేక సినీ కార్మికులు ఎంతగానో ఇబ్బందులను ఫేస్ చేశారు. ఇక అన్‌లాక్ ప్రకటించిన తర్వాత కాస్త పర్వాలేదు అనుకుంటున్న పరిస్థితుల్లో మరోసారి కరోనా తన ఉదృతిని మొదలెట్టింది. భారీ స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో.. మళ్లీ లాక్డౌన్ అనేలా వార్తలు వినిపిస్తుంటే.. ఒక్కొక్కరిలో భయాందోళనలు మొదలవుతున్నాయి. కాస్త సినిమా ఇండస్ట్రీ కుదురుకుంటోంది అనుకుంటున్న సమయంలో.. సెలబ్రిటీలందరూ కరోనా బారిన పడుతుండటంతో.. ఇండస్ట్రీలో కూడా ఆందోళన మొదలైంది. బాలీవుడ్లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కరోనా బారిన పడి, క్వారంటైన్లో ఉన్నారు. తాజాగా టాలీవుడ్‌కి సంబంధించి ‘వకీల్ సాబ్’ నటి నివేదా థామస్ కరోనా బారిన పడినట్లుగా.. ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దీంతో ఏప్రిల్ 9న విడుదల కాబోతోన్న ‘వకీల్ సాబ్’ టీమ్‌లో టెన్షన్ మొదలైంది.