రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అవసరమని వ్యాఖ్యానించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశవర్‌రెడ్డి.

 రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అవసరమని వ్యాఖ్యానించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశవర్‌రెడ్డి.

తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశవర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. శనివారం తాండూరులో వివిధ పార్టీల నేతలతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార బలంతో ఉన్న తెలంగాణ పార్టీని ఎదుర్కొనేందుకు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అవసరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో అధికార బలంతో ఉన్న టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేందుకు కొత్తగా మరో ప్రాంతీయ పార్టీ ఏర్పాటు విషయమై రాష్ట్రంలో వివిధ పార్టీల ముఖ్యనాయకులతో మాట్లాడారు. కుదిరితే పార్టీ ఏర్పాటు చేస్తాం.. లేదంటే బీజేపీలో చేరేందుకు 90 శాతం అవకాశం ఉంది అని అన్నారు. తాను అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపిన ఆయన…ఇంతకు ముందు సూచించిన ఆరు అంశాల విషయంలో కాంగ్రెస్‌ నుంచి అంగీకారం వస్తే మళ్లీ ఆ పార్టీలో చేరే విషయాన్ని ఆలచిస్తానని అన్నారు. జూన్‌లో కాంగ్రెస్‌లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని, దేశంలో ఏ పార్టీ సిద్ధాంతాలు లేవని, బీజేపీ హిందుత్వ పార్టీ అని అన్నారు.

తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి తానే కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇప్పించానని, గెలిచిన తర్వాత ద్రోహం చేశారని ఆరోపించారు. ఇంజనీరింగ్‌ చేశానంటే వ్యాపారంలోనూ భాగస్వామ్యం కూడా ఇచ్చానని, అతను అసలు ఇంజనీరే కాదని అన్నారు. తాను టీఆర్‌ఎస్‌ తరపున ఎంపీగా గెలిచినప్పటికీ, పార్టీ తీరు నచ్చక కాంగ్రెస్‌ పార్టీలో చేరానని అన్నారు. అయితే కాంగ్రెస్‌ పోరాడే తత్వాన్ని మర్చిపోయిందని, అందుకే ఆ పార్టీని వీడానని చెప్పుకొచ్చారు.

Related post