తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వర్ష సూచనలు.

 తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వర్ష సూచనలు.

రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వర్ష సూచనలు ఉన్నట్లు హైదారాబాద్ వాతావారణ కేంద్రం ప్రకటించింది. తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

నిన్నటి ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దాని పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతూ సముద్ర మట్టం నుంచి 2.1 కి.మీ. వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది.ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ తీరం, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందన్నారు. అలాగే దక్షిణ మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాలలో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడిందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ మరియు దక్షిణ గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావం కారణంగా  రాష్ట్రం వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు కనిపించనున్నాయి. రాగల మూడు రోజుల వరకు వాతావరణలో మార్పుకు కనిపించనున్నాయి. ఈరోజు, రేపు ఆకాశం మేఘావృతంగా ఉంది. వర్షం లేకుండా కేవలం ఉరుములు, మెరుపులు వాతావరణం చల్లగా ఉండనుంది. ఇక  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మరియు తూర్పు గోదావరి జిల్లాల్లో కూడా వశం లేకుండా ఉరుములు మెరుపులతో వాతావరణం మారనుంది

Related post