హైకోర్టులో అప్పీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమనీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

 హైకోర్టులో అప్పీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమనీ  మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.

ఎపిలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలను చివరి నిమిషంలో వాయిదా వేస్తూ హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులపై ప్రభుత్వం స్పందించింది. హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ రేపు హైకోర్టులో అప్పీలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎన్నికల పోలింగ్‌కు సమయం తక్కువగా ఉన్నందున అత్యవసరంగా ఈ పిటిషన్‌ను విచారణకు చేపట్టాలని కోరనుంది. ఎపిలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలపై స్టే విధిస్తూ ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధి పనులు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎన్నికల కోడ్‌ అడ్డంకి కాకూడదనే త్వరితగతిన ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

పారిపోయిన టిడిపి, ఓడిపోతామని తెలిసి నామమాత్రపు స్ధానాల్లో పోటీ చేస్తున్న బిజెపి, జనసేన ఎన్నికలను అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రేపు అప్పీలు చేయనున్నట్లు తెలిపారు. డివిజన్‌ బెంచ్‌లో ప్రభుత్వం తరపున హౌస్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని వెల్లడించారు. డివిజన్‌ బెంచ్‌లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. డివిజన్‌ బెంచ్‌ కూడా 21 రోజుల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇస్తే అందుకు కూడా ప్రభుత్వం సిద్ధమేనన్నారు

Related post