తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌.

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కొవిడ్‌ సోకినట్లు సీఎస్‌ స్వయంగా వెల్లడించారు. అయితే ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం అందలేదు. మంగళవారం ఉదయమే కరోనా నియంత్రణపై కలెక్టర్లతో సోమేష్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నిన్న సీఎం కేసీఆర్‌తో సోమేష్‌కుమార్‌ సమావేశమయ్యారు. ఇటీవల ఆయన వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ కూడా తీసుకున్నారు.

అయితే.. తెలంగాణలో కరోనా టెన్షన్ పెడుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలకు పూనుకుంది. బహిరంగ ప్రదేశాలు, వర్క్‌ ప్లేసెస్‌లో మాస్క్‌ తప్పనిసరి చేసింది. ఏప్రిల్ 30 వరకు సామూహిక కార్యక్రమాలపై నిషేధించింది. ర్యాలీలు, యాత్రలను బ్యాన్ చేసిన ప్రభుత్వం.. పండుగలపై కూడా ఆంక్షలు విధించింది. హోలీ, శ్రీరామనవమి వేడుకల్లో గూమిగూడొద్దని సూచించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది

Related post