ఏప్రిల్‌ 7న బన్నీ పుష్పరాజ్‌ లుక్‌ రిలీజ్.

 ఏప్రిల్‌ 7న బన్నీ పుష్పరాజ్‌ లుక్‌ రిలీజ్.

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ సారథ్యంలో అల్లు అర్జున్‌ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. కాగా ఈ సినిమా ప్రత్యేక కార్యక్రమం ఏప్రిల్‌ 7న హైదరాబాద్​లోని జేఆర్​సి కన్వెన్షన్​ ​ హాల్​లో జరగునుంది. ఈ కార్యక్రమంలో బన్నీ పుష్పరాజ్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా సాయంత్రం పుష్ప లుక్‌ను రిలీజ్ చేయనున్నారు. ఇటీవల రిలీజ్​ అయిన ఈ చిత్ర ప్రీల్యూడ్​ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇందులో వెనుక వైపు నుంచి బన్నీ లుక్​ ఫ్యాన్స్‌ని ఫిదా చేస్తుంది. కాగా ఈ సినిమాలో రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తోంది..

చిత్ర విశేషానికొస్తే ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో బన్నీ లారీ క్లీనర్‌ పాత్రలో నటించనున్నాడనే విషయం తెలిసిందే. ప్రతి సినిమాలో తన మేకోవర్‌ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకున్న బన్నీ ఈ సినిమా కోసం కూడా అదే స్థాయిలో దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో బన్నీ లుక్‌ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోల్లో బన్నీ తన స్టైల్‌ను పూర్తిగా మార్చేశాడు.

ఈ సినిమానుంచి అప్డేట్స్ కోసం బన్నీ అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అడవిలో చేతులు కట్టేసి ముఖం పై ముసుగుతో బన్నీ పరిగెడుతున్న సన్నివేశాన్ని గ్లిమ్ప్స్ రూపంలో వదిలారు మేకర్స్. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఈ పాన్ ఇండియన్ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ముత్యం శెట్టి మీడియా వారు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Related post