మార్చిలో ఎన్నికల షెడ్యూల్..

 

కేంద్ర ఎన్నికల కమిషన్‌ సార్వత్రిక ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన ఎన్నికల కమిషనర్లు త్వరలోనే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

కాగా, మార్చి 13వ తేదీ తర్వాత ఏ క్షణంలోనైనా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.

 

ఎన్నికల ఏర్పాట్లపై ఎన్నికల కమిషనర్ల రాష్ట్రాల పర్యటన చివరి దశకు చేరుకుంది.

 

మార్చి 12, 13న జమ్మూ కశ్మీర్ పర్యటన అనంతరం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

 

ఎన్నికల సంఘం.. అన్ని డివిజన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏర్పాటు చేయనుంది.

 

ఇక, దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్‌ నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

 

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.