Panel Portal Opinions – What to anticipate in a Table Portal
న్యూజిలాండ్‌తో భారత్ తొలి టెస్టు

న్యూజిలాండ్‌లో భారత పర్యటన చివరి అంకానికి తెరలేవనుంది. లిమిటెట్ క్రికెట్ నుంచి సంప్రదాయ ఫార్మాట్లో తలపడటానికి కివీస్, టీమిండియా రెడీ అయ్యాయి.. టి20, వన్డే సిరీస్‌లను సమంగా పంచుకున్న తర్వాత భారత్, న్యూజిలాండ్ ఇప్పుడు సాంప్రదాయ ఫార్మాట్‌కు సై అంటున్నాయి. రెండు టెస్ట్‌ల భాగంగా సిరీస్‌లో ఫస్ట్ మ్యాచ్ శుక్రవారం వెల్లింగ్టన్లో ప్రారంభం కానుంది. దీంతో సంప్రదాయ ఫార్మాట్లో సత్తా చాటాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇప్పటివరకు ఆడింది ఒక ఎత్తయితే రాబోయే రెండు మ్యాచ్‌ల్లో రాణించడం మరో ఎత్తు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ అజేయంగా నిలిచిన భారత్ 360 పాయింట్లతో టాప్‌లో ఉంది. టెస్టు ఛాంపియన్షిప్ మొదలైనప్పటి నుంచి తిరుగులేని ప్రదర్శనతో అగ్రస్థానంలో ఉంటూ వస్తోన్న భారత్.. బలాబలాల్లో మెరుగ్గానే ఉంది. కానీ పేస్‌కు అనుకూలించే పరిస్థితుల్లో, సొంతగడ్డపై వన్డే సిరీస్ గెలిచిన ఊపుమీదున్న న్యూజిలాండ్‌తో పోరు కోహ్లీసేనకు పరీక్షే.
టీమిండియా తమ ఆఖరి టెస్టును కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై ఆడింది. అక్కడితో పోలిస్తే వాతావరణం, పిచ్ పరిస్థితులు న్యూజిలాండ్‌లో పూర్తిగా భిన్నం కాబట్టి స్వల్ప మార్పులు ఖాయం. రోహిత్ శర్మ గాయంతో దూరం కావడంతో మయాంక్‌కు తోడుగా పృథ్వీ షా ఓపెనింగ్ చేయడం దాదాపుగా ఖాయమైంది. మరో యంగ్ ప్లేయర్ శుబ్‌మన్ గిల్ టెస్టు అరంగేట్రం కోసం కొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. అయితే ప్రతికూల వాతావరణంలో కివీస్ పేసర్లను సమర్థంగా ఎదుర్కొని ఓపెనర్లు పరుగులు సాధించడం అంత సులువు కాదు. జట్టుకు మంచి స్టార్ట్ దక్కకపోతే ఆ తర్వాత అది మ్యాచ్‌పై ప్రభావం చూపించవచ్చు. సొంతగడ్డపై టీమ్ మేనేజ్మెంట్ ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌నే ఆడించేది. కానీ, కివీస్లాంటి చోట లోతైన బ్యాటింగ్ అవసరం కాబట్టి ఆరో స్థానంలో కూడా రెగ్యులర్ బ్యాట్స్‌మన్‌ను ఆడించక తప్పని పరిస్థితి. అందుకోసం ఆంధ్ర క్రికెటర్ హనుమ విహారి సిద్ధంగా ఉన్నాడు. ఇక, బౌలింగ్‌లో ముగ్గురు పేసర్లకే మొగ్గు చూపవచ్చు. గత రెండున్నరేళ్లలో ఇదే వ్యూహంతో విదేశాల్లో ప్రత్యర్థి జట్లను ఆలౌట్ చేసింది టీమిండియా. గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ ఎలాంటి ఇబ్బంది లేకుండా నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. ఇషాంత్‌తో పాటు షమీ, బుమ్రాలు పేస్ భారం మోస్తారు. స్పిన్నర్‌గా మాత్రం ఒకరికే చోటు ఉంది. అశ్విన్ లేదా జడేజాలలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. 2013 నుంచి విదేశాల్లో ఇద్దరి రికార్డు దాదాపు ఒకేలా ఉంది. కీపర్‌గా సందేహం లేకుండా వృద్ధిమాన్ సాహానే ఉంటాడు. దీంతో రిషభ్ పంత్‌కు నిరాశ తప్పదు. 2014లో ఇక్కడ టెస్టులు ఆడిన అనుభవం ప్రస్తుత జట్టులో కోహ్లి, పుజారా, రహానే, జడేజా, ఇషాంత్, షమీలకు ఉంది. ఆస్ట్రేలియాలో గెలిచినట్లుగా న్యూజిలాండ్‌లోనూ సిరీస్ విజయం సాధిస్తే నాయకుడిగా కోహ్లి ఘనతల్లో మరొకటి చేరుతుంది.