• September 17, 2021

వెంకీతో విభేదాలపై అఖిల్ సూపర్ పంచ్..

 వెంకీతో విభేదాలపై అఖిల్ సూపర్ పంచ్..

నిప్పు లేకుండా పొగరాదు.. కానీ ఇప్పుడు నిప్పు లేకుండానే పొగను సృష్టిస్తున్నారు. వార్తల కోసం గోరంతలు కొండంతలుగా చేస్తున్నారు. మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. విచ్చలవిడిగా వెలువడుతున్న కథనాలకు బాధితులు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితులు నేడు ఏర్పడుతున్నాయి. తాజాగా టాలీవుడ్ లోనూ అలాంటి పరిస్థితే ఏర్పడింది.

తొలి ప్రేమ తో హిట్ కొట్టిన దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం అఖిల్ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. వీరి మధ్య విభేదాలు అంటూ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అందుకు సమాధానంగా వారిద్దరూ కలిసి ఓ ఫన్నీ వీడియోను రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు.

* అసలు వివాదం ఏంటంటే..

ప్రస్తుతం తొలిప్రేమ తర్వాత అఖిల్ తో వెంకీ అట్లూరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ లో వెంకీ చేస్తున్న మార్పులు అఖిల్ కు నచ్చడం లేదని.. అందుకే అఖిల్ రెండు రోజులు షూటింగ్ కు రాలేదని వార్తలు షికారు చేశాయి. ఈ ఇద్దరి మధ్య క్రియేటివ్ క్లాషెస్ కారణంగా సినిమా ఆగిపోయే ప్రమాదంలో పడిందనేది ఈ వార్తల సారాంశం.

ఈ వార్త దుమారం రేపడంతో తాజాగా వెంకీ అట్లూరి – అఖిల్ స్పందించారు. సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు. అదిప్పుడు వైరల్ గా మారింది. ‘నువ్వే చెప్పు అంటే నువ్వే చెప్పు అని గొడపడినట్లు నటించారు. వాదులాడుకున్నట్టు కనిపించారు’.  ఆ తర్వాత అఖిల్ మాట్లాడుతూ వెంకీకి నాకు క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయంటూ వార్తలు వచ్చాయి అని అన్నాడు.  వారి మధ్య ఏం లేదని  నిరూపించేందుకు ఆ వీడియో ద్వారా సీరియస్ కామెడీ చేశారు.  గాసిప్పులను ఎద్దేవా చేసే విధంగా ఈ వీడియో ఉంది. చివరలో ఒకరి ముఖం ఒకరు చూసుకొని బిగ్గరగా నవ్వుకున్నారు. ఆ తర్వాత వెంకీని ముద్దుపెట్టుకొని అక్కడి నుంచి అఖిల్ పారిపోయాడు.

ఇలా అఖిల్ – వెంకీలు తమ మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని.. మీడియాకు షాకిచ్చేలా.. గాసిప్పిలు రాసేవారికి దిమ్మదిరిగేలా వీడియోను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *