• September 17, 2021

పవన్ కు సారీ చెబుతూనే శ్రీరెడ్డి పంచ్

 పవన్ కు సారీ చెబుతూనే శ్రీరెడ్డి పంచ్

క్యాస్టింగ్ కౌచ్ పై గళం విప్పటమే కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనను ఎంతగా మోసం చేశారో చెప్పి సంచలనానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన శ్రీరెడ్డిని ఎవరూ మర్చిపోలేరు. పవన్ మీద ఆమె చేసిన వ్యాఖ్యలు.. వాటిపై పవన్ సీరియస్ కావటం.. తర్వాతి చోటు చేసుకున్న పరిణామాలతో అప్పటివరకూ శ్రీరెడ్డికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన కొన్ని మీడియాలో ఆ తర్వాత చప్పుడు చేసింది లేదు.

నాటి నుంచి శ్రీరెడ్డి మీడియాలో కనిపించింది లేదు. సోషల్ మీడియాలో మాత్రం అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ కొందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ ప్రస్తావన తీసుకురాకుండా తన పని తాను అన్నట్లుగా ఉన్న ఆమె.. తాజాగా పవన్ ను మరోసారి టచ్ చేశారు.

పవన్ ను టార్గెట్ చేస్తూ తాజాగా ఒక పోస్టు పెట్టారు. వీరనారి విభాగం గురించి మాట్లాడుతూ.. మీరు ఒక మాట అన్నారు సార్. నేను నా సినిమాల్లో ఎక్స్ పోజింగ్ సీన్స్ కు అనుమతి ఇవ్వను. మహిళలంటే గౌరవం అని.. గుర్తు చేద్దామని చిన్న ప్రయత్నం సార్.. సారీ అని పేర్కొంటూ పవన్ నటించిన సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేసే మహిళలకు సంబంధించిన ఫోటోల్ని పోస్టు చేశారు.

పవన్ మాటలకు కౌంటర్ వేసినట్లుగా శ్రీరెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. కాకుంటే.. గతానికి భిన్నంగా.. సార్.. సారీ అన్న మాటల్ని పొందిగ్గా వాడుతూ ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎప్పటిలానే శ్రీరెడ్డి పోస్టుపై కొందరు తీవ్రంగా విరుచుకుపడుతూ ఆమెను తప్పు పడుతున్నారు. నలుగురి నోళ్లల్లో నానాలన్నా.. వివాదాల లైమ్ లైట్ లో ఉండాలంటే పవన్ ప్రస్తావన తప్పదు కదా?

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *