జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్లో కాంగ్రెస్ నేత‌ రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు..

 జూబ్లీహిల్స్ పోలీసు స్టేష‌న్లో కాంగ్రెస్ నేత‌ రేవంత్ రెడ్డి పై ఫిర్యాదు..

2002 లో జూబ్లీ హిల్స్ కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ ఎగ్సిగ్యూటివ్ క‌మిటీ లో రేవంత్ రెడ్డి మెంబ‌ర్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డితో పాటు మ‌రో ఏడుగురు కూడా క‌మిటీ స‌భ్యులుగా ఉన్నారు. అదే స‌మ‌యంలో సుమారు ఏడు ప్లాట్ల విష‌యంలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఆరోపిస్తూ హౌసింగ్ సొసైటీ స‌భ్యుల మీద ఇమ్మ‌నేని రామారావు నాంప‌ల్లి కోర్టుకు వెళ్ల‌డం జ‌రిగింది.

2002 లో కోర్టుకు వెళ్లిన రామారావుకు ఎదురుదెబ్బ త‌గిలింది. కోర్టు కోఆప‌రేటివ్ హౌసింగ్ సొసైటీకి అనుకూలంగా స్టే ఇచ్చింది. తాజాగా రామారావు అనే వ్య‌క్తి స్టే ఎన్ని సంవ‌త్స‌రాలు కొన‌సాగుతుంద‌ని ప్ర‌శ్నిస్తూ మ‌ళ్లీ నాంప‌ల్లి కోర్టుకు వెళ్ల‌డం జ‌రిగింది. కాగా నాంప‌ల్లి కోర్టులో కేసుకు సంబందించిన ఫైల్ లేక‌పోవ‌డంతో స‌ద‌రు రామారావు అనే వ్య‌క్తి ఫైల్ మిస్సింగ్ వెన‌క రేవంత్ రెడ్డి హ‌స్తం ఉందంటూ, ఆయ‌న మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని జూబ్లీహిల్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

News 9

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *