శ్రీరెడ్డి చెన్నై వెళ్లి తమిళ లీక్స్ అంటూ కాస్టింగ్ కౌచ్ చేసిన పలువురి పేర్లను విడుదల

 శ్రీరెడ్డి చెన్నై వెళ్లి తమిళ లీక్స్ అంటూ కాస్టింగ్ కౌచ్ చేసిన పలువురి పేర్లను విడుదల

శ్రీరెడ్డి చిక్కుల్లో పడింది. కాస్టింగ్ కౌచ్ తో టాలీవుడ్ ను షేక్ చేసిన ఈ భామ.. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీపై తన ఫోకస్ మళ్లించిన సంగతి తెలిసిందే..  శ్రీకాంత్ రాఘవ లారెన్స్  తనకు అవకాశాలు ఇప్పిస్తామని మోసం చేశారని సంచలనం ఆరోపణలు చేసింది. అంతటితో ఊరుకోకుండా ఈరోజు చెన్నై వెళ్లి తమిళ లీక్స్ అంటూ కాస్టింగ్ కౌచ్ చేసిన పలువురి పేర్లను విడుదల చేసింది. ఈ కోవలోనే ప్రముఖ నటి కుష్బూ భర్త సుందర్ సిపై శ్రీరెడ్డి దారుణమైన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సుందర్ సి సిద్దమైనట్లు తెలిసింది.

*శ్రీరెడ్డి ఫేస్ బుక్ లో రాసుకొచ్చింది ఇదే..

‘హైదరాబాద్ లో అరన్ మనయ్ షూటింగ్ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత గణేష్ తో కలిసి వెళ్లి సుందర్ సి ని కలిశాను. ఆ సందర్భంగానే తన తదుపరి చిత్రంలో నాకు అవకాశం ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత నోవాటెల్ కు రమ్మన్నాడు. శారీరక సుఖాన్ని ఇవ్వాలని అడిగాడు. ఆ తర్వాత ఏదో జరిగిపోయింది’ అని శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ పోస్టులో పేర్కొంది.

శ్రీరెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తాజాగా చెన్నైలో సుందర్ సీ స్పందించారు. ఆ వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఆమె చెప్పేదంతా అబద్ధమని కొట్టిపారేశారు. అవాస్తవాలు చెబుతున్న శ్రీరెడ్డిపై కేసు పెడతానని హెచ్చరించారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టు సుందర్ సీ తెలిపారు.

కోలీవుడ్ లోని కాస్టింగ్ కౌచ్ పై యుద్ధం ప్రకటించిన శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉంది. చైన్నై మీడియాలో ఆమె హల్ చల్ చేస్తోంది. కొందరిపై తాను ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది.

News 9

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *