సివిల్ సప్లై అధికారులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు..
సివిల్ సప్లై అధికారులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలుఉంటాయని సీవిల్ సప్లై చైర్మన్ చల్లా రామకృష్ణ రెడ్డి హెచ్చరించారు.కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరులో MLS పాయింట్ తనిఖీ చేసి రేషన్ డీలర్లతో సమావేశమయ్యారు చైర్మన్ చల్లా. తుకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఎమ్మిగనూరు MLS పాయింట్ ను తనిఖీ చేయాల్సివచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలలోని ఎంఎల్ఎస్ పాయింట్ లను తనిఖీ చేస్తానని తెలిపారు.ఇప్పటికే మొదటి దఫా పర్యటన పూర్తయిందని ఇప్పుడు రెండో దశ పర్యటన ప్రారంభించనున్నారు.ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయసాలకోర్చి డీలర్ లకు నిత్యావసర సరుకులు సరఫరా చేస్తోందని కానీ డీలర్లు సక్రమంగా పంపిణీ చేయకుండా ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారని పద్దతి మార్చుకొని తనకు సహకరించాలని డీలర్లను కోరారు.తుకాల్లో ఎలాంటి అవకతవకలకు పాల్పడమంటూ ఇప్పుడే ఇక్కడే ప్రమాణం చేయాలంటూ సమావేశనికొచ్చిన డీలర్లతో ప్రమాణం చేయించారు.MLS సిబ్బంది తుకాల్లో తేడా ఉంటే డీలర్లు తిరస్కరించాలని డీలర్లు MLS పాయింట్ నుండి తూకం సరిగా పొంది కార్డుదారులకు తూకం సరిగా పంపినిచేయలని కోరారు.సమావేశంలో స్థానిక MLA జయనాగేశ్వర రెడ్డి సివిల్ సప్లై అధికారులు,రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.సివిల్ సప్లై అధికారులు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు..