ఉత్తమ్‌కుమార్‌వి దిగజారుడు రాజకీయాలు: KTR

 ఉత్తమ్‌కుమార్‌వి దిగజారుడు రాజకీయాలు: KTR

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ పరస్పర విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ పరస్పర విమర్శలు,శాసనసభ ఎన్నికల వేళ.. మంత్రి కేటీఆర్‌ బంధువు ప్రభాకర్‌, ఆయన కింది ఉద్యోగులు తనతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఆరోపించారు. రాధాకృష్ణారావుకు ప్రతిపక్ష నేతల వాహనాలు తనిఖీ చేసే పని అప్పగించారని అన్నారు.ఈ అంశాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించాలని డిమాండ్‌ చేశారు.కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఈ అధికారులపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా హెచ్చరించారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ.. ఉత్తమ్‌కుమార్‌ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ నేతలు రూ.3కోట్ల నగదు కారులో తరలిస్తూ పట్టుబడ్డారని.. ఉత్తమ్ అందుకే ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారని అన్నారు.లాంటి అంశాలను రాజకీయం చేసి అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌ పరస్పర విమర్శలు

News 9

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *