విజయ్ సేతుపతితో కలిసి నటించాలని ఉంది :కీర్తి సురేష్

 విజయ్ సేతుపతితో కలిసి నటించాలని ఉంది :కీర్తి సురేష్

keetrhisuresh vijay setupathi

keetrhisuresh vijay setupathi
vijaysetupathi, keetrhisuresh

మహానటి సినిమాతో తెలుగులో బాగా పాపులర్ అయిన కీర్తి సురేష్, తమిళ సినిమాల్లో దూసుకుపోతున్నది. ప్రస్తుతం కీర్తి సురేష్.. విజయ్ సర్కార్ సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా నవంబర్ 6 న ప్రపంచవ్యాప్తంగా విడుద‌ల‌ కాబోతున్నది. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ గా ఎదిగిన తరువాత వారికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. కొంతమందితో కలిసి పనిచేయడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కీర్తి సురేష్ కు కూడా అలాంటి కోరికలు రెండు ఉన్నాయట. అందులో ఒకటి విజయ్ సేతుపతితో కలిసి నటించడం.  విజయ్ సేతుపతి విలక్షణమైన నటుడు.  నటన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే అతనితో కలిసి పనిచేయాలన్నది తన కోరిక అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నది. అలాగే ఎప్పటికైనా సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరిక కూడా కీర్తి సురేష్ కు ఉందట.  అందుకోసం ఖాళీగా ఉన్న సమయాల్లో కథలు రాసుకుంటున్నదట.

News 9

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *