విశ్రాంతి నిమిత్తం వెస్టిండీస్‌ పర్యటనకు కోహ్లీ???

రెండు టెస్టు మ్యాచ్‌ల కోసమని టీమిండియా వచ్చే నెలలో వెస్టిండీస్‌తో తలపడనుంది. అయితే ఈ పర్యటనలో భారత సారథి విరాట్‌ కోహ్లీ కూడా ఆడాలని నిర్ణయించుకున్నట్లు తాజాగా తెలిసింది. ఈ ఏడాది ఆరంభం నుంచి తీరిక లేని క్రికెట్‌ ఆడుతుండటంతో కోహ్లీ, ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. విశ్రాంతి నిమిత్తం వెస్టిండీస్‌ పర్యటనకు దూరంగా ఉంటారని కొన్ని రోజులుగా వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇదిలాఉండగా, కోహ్లీ మాత్రం ఆగస్టులో విండీస్‌తో మూడు ఫార్మాట్లలోనూ ఆడాలనుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయమై తాజాగా అతను సెలక్టర్లను కూడా సంప్రదించినట్లు సమాచారం. వెస్టిండీస్‌ పర్యటనకుగానూ ఈ నెల 19న ముంబయిలో జట్టు ఎంపిక జరగనుంది.

News 9

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *