యాషెస్‌ టీంలను ప్రకటించిన షేన్‌వార్న్‌

ప్రపంచకప్‌ మధురానుభూతులు మర్చిపోకముందే క్రికెట్‌ ప్రేమికుల కోసం మరో రసవత్తరమైన సిరీస్‌ ప్రారంభంకానుంది. పది రోజుల్లో చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లాండ్‌ X ఆస్ట్రేలియా జట్లు ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌లో పాల్గొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్‌ అభిమానుల చూపులు ఇప్పుడు తెల్ల బంతి నుంచి ఎరుపు బంతిపై పడ్డాయి. ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో ఇరు జట్లూ పోటాపోటీగా తలపడే అవకాశం ఉంది. ఇటీవల ప్రపంచకప్‌లో ఆసీస్‌ సెమీస్‌ వరకూ చేరగా ఇంగ్లాండ్‌ విశ్వవిజేతగా నిలిచింది.ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్‌ దిగ్గజం షేన్‌వార్న్‌ యాషెస్‌ సిరీస్‌లో తలపడే తన కలల జట్లను ప్రకటించాడు. ట్వీటర్‌ వేదికగా ఆసీస్‌ జట్టును తొలుత ప్రకటించాడు. ఇక బౌలర్ల విషయంలో మిచెల్‌ స్టార్క్‌, హాజిల్‌వుడ్‌ మధ్య బలమైన పోటీ ఉందని పేర్కొన్నాడు. అనంతరం ఇంగ్లాండ్‌ జట్టులో 12 మంది ఆటగాళ్ల పేర్లు వెల్లడించాడు.

News 9

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *