తొలి టెస్టులో సత్తా చాటిన బౌలర్‌ షబ్నాజ్‌ నదీమ్‌

 

ఇండియా ఎ X వెస్టిండీస్‌ ఎ జట్ల మధ్య జరుగుతున్న అనధికారిక తొలి టెస్టులో భారత బౌలర్‌ షబ్నాజ్‌ నదీమ్‌ సత్తాచాటాడు. ఐదు వికెట్ల(62/5) ప్రదర్శనతో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేశాడు. బుధవారం జరిగిన తొలిరోజులో అటు బౌలింగ్‌తో పాటు ఇటు బ్యాటింగ్‌లోనూ విండీస్‌ జట్టుపై ఇండియా ఎ ఆధిపత్యం చెలాయించింది. తొలుత విండీస్‌ ఎ జట్టు బ్యాటింగ్‌ ఆరంభించగా మహ్మద్‌ సిరాజ్‌ ఓపెనర్లను ఔట్‌చేసి పెవిలియన్‌ చేర్చాడు. తర్వాత శివందుబే.. ఆ కెప్టెన్‌ షమార్హ్‌ బ్రూక్స్‌ను ఔట్‌చేశాడు.
ఆపై బౌలింగ్‌కు వచ్చిన నదీమ్‌ చెలరేగిపోయాడు. విండీస్‌ ఎ జట్టు మిడిల్‌ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. ఒక దశలో 97/5తో ఉన్న విండీస్‌ను జర్మైన్‌ బ్లాక్‌వుడ్‌(53), రకీమ్‌ కార్న్‌వాల్‌(59)లు ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 98 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టుకు గౌరప్రదమైన స్కోరు అందించారు. అనంతరం మయాంక్‌ మార్కండే రెండు వికెట్లు తీయడంతో విండీస్‌ ఎ జట్టు 228 పరుగులకు ఆలౌటైంది.

News 9

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *