‘అల.. వైకుంఠపురములో….

టాలీవుడ్‌ స్టైలిష్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా నాన్‌ బాహుబలి2 రికార్డ్స్‌ను సృష్టించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. బన్నీ నటన, డ్యాన్స్‌లతో యాక్షన్‌ సన్నివేశాలకు అభిమానులు ఫిదా అయిపోగా.. త్రివిక్రమ్‌ తన మార్క్‌ డైలాగ్స్‌, స్ర్కీన్‌ప్లేతో మెప్పించాడు. విడుదలైన అన్ని చోట్లా పాజిటీవ్ టాక్‌తో ఈ చిత్రం దూసుకెళ్తోంది.

ఇదిలా ఉండగా ‘అల వైకుంఠపురములో..’ సినిమా నైజాం, వైజాగ్, కృష్ణ , వెస్ట్, సీడెడ్, గుంటూరు, నెల్లూరు ఏరియాల్లో నాన్ బాహబలి-2 రికార్డ్స్  క్రియేట్ చేసింది. ఇది ఆల్ టైమ్ రికార్డ్‌గా చెప్పవచ్చు. మూడో రోజు షేర్‌కు ఎనిమిది ప్రాంతాలు, నాలుగోరోజు షేర్‌కి ఏడు ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ సృష్టించడం విశేషం. ఓవర్సీస్‌లో విడుదలైన చిత్రాల్లో ‘అల.. వైకుంఠపురములో..’ నంబర్ 1 స్థానంలో దూసుకెళ్తోంది. దీంతో బన్నీ అభిమానులందరూ.. విజిల్స్‌ సరిపోవు అని అంటున్నారు. 

News 9

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *