ఢిల్లీలో ఇంకా ఆగని అల్లర్లు : 50 మంది నిందితులను అరెస్టు , 163 మంది పై కేసులు

 ఢిల్లీలో ఇంకా ఆగని అల్లర్లు : 50 మంది నిందితులను అరెస్టు , 163 మంది పై  కేసులు
అమెరికా అధ్యక్షుడు పర్యటనతో మొదలైన అల్లర్లు ఇంకా తగ్గటం లేదు ఈ అల్లర్ల కు కారణం అని అనుమానిస్తున్న వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఢిల్లీ పోలీసులు  .దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో కొందరు వదంతులను వ్యాప్తి చేయడంతో భయాందోళనలు చెందిన 1880 మంది సహాయం కోసం పోలీసులకు ఫోన్లు చేశారు. అల్లర్లపై వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీసులు వందకుపైగా కేసులు నమోదు చేసి 50 మంది నిందితులను అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసు యాక్ట్ ప్రకారం సెక్షన్ 65 ప్రకారం 163 కేసులు, ఐపీసీ సెక్షన్ 107,151 సెక్షన్ల ప్రకారం మూడు కేసులు నమోదు చేశారు. ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్నాయని వదంతులను వ్యాప్తి చేస్తున్న వారిపై పోలీసులు దృష్టి సారించారు.వదంతులపై సెంట్రల్ పోలీసు కంట్రోల్ రూం అధికారులు నిఘా పెట్టారు. ఢిల్లీ అల్లర్లలో 47 మంది మరణించగా, మరో 200 మంది గాయపడ్డారు. ఢిల్లీలోని ద్వారక, అవుటర్, రోహిణి జిల్లాల్లో వదంతులు వ్యాప్తి చేస్తున్నారు. ఢిల్లీలో శాంతిని నెలకొల్పేందుకు వీలుగా వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై పోలీసులు కఠినచర్యలు తీసుకుంటున్నారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

credit: third party image reference

Related post