మార్చి 8 న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్ : ఆర్థిక మంత్రి హరీశ్ రావు

 మార్చి  8 న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్ : ఆర్థిక మంత్రి హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రం లో మార్చి 8న(ఆదివారం) రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్నారు. మొత్తం 12 రోజులపాటు జరిగే ఈ సమావేశాలు మార్చి 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మార్చి 9, 10, 15 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు. బీఏసీ సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క హాజరయ్యారు. మార్చి 20వ తేదీన మరోసారి బీఏసీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల పొడగింపుపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా, శనివారం సాయంత్రం తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేయనున్నారు. శుక్రవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. పేదలకు కనీస జీవన భద్రత కల్పించాలని సంకల్పించి సంక్షేమ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు భద్రత కల్పించాయన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉండే కుటుంబాలను నిర్ధారించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయ పరిమితిని రూ. 60వేల నుంచి రూ. లక్షన్నరకు పెంచిందని గవర్నర్ తెలిపారు.

News 9

Related post