కరోనా వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాలలో సినిమా ధియేటర్స్ మూసివేసే దిశగా…..

 కరోనా వైరస్ కారణంగా  తెలుగు రాష్ట్రాలలో సినిమా ధియేటర్స్ మూసివేసే దిశగా…..

కరోనా వైరస్ కారణంగా తెలుగు రాష్ట్రాలలో సినిమా ధియేటర్స్ మూసివేసే దిశగా….. వివరాలలోకి వెళ్తే కరోనావైరస్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజులపాటు థియేటర్లను మూసివేయాలని సినీపెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. గురువారం సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో టాలీవుడ్ సినీ పెద్దలు సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాలని పలువురు సీనియర్లకు బుధవారం సాయంత్రం మెసేజ్‌లు వెళ్లాయి. కరోనా ప్రభావంతో విదేశీ షూటింగ్‌లను కూడా వాయిదా వేసుకోవడం, కేసుల సంఖ్యను పెరిగే అంశాన్ని బట్టి, సినిమా హాల్స్ మూసివేత తదితర నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. కాగా, కరోనా విజృంభించిన చైనాలోని ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే థియేటర్లు మూతపడ్డాయి.

News 9

Related post