BS-6 వాహనాలు నడపాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే ..!

 BS-6 వాహనాలు నడపాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే ..!

బీఎస్ – 6 వాహనాల్లో మాత్రం చౌక్ వ్యవస్థే లేదని నిపుణులు వెల్లడిస్తున్నారు. వాహన ట్యాంకులో కనీసం లీటర్ పెట్రోల్ నిల్వ ఉండాలి. ఇంధనం లేకపోతే..ట్యాంకు నుంచి పెట్రోల్ పంపింగ్ కాదని నిపుణులు వెల్లడిస్తున్నారుఆధునిక ఇంజిన్లతో వచ్చిన బీఎస్ – 6 వాహనాల్లో మాత్రం కనీసం లీటర్ పెట్రోల్ లేకపోతే బండి కదలదు. సదరు బైక్‌లపై ప్రయాణించాలనుకొనే వారు పెట్రోల్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ఈ వాహనాల ఇంజిన్‌ను స్టార్ట్ చేసిన సందర్భంలో శబ్దం సైతం వెలువడదని, శుద్ధి చేసిన చమురు వాడకంతో పాటు..బీఎస్ – 6 ఇంజిన్ కారణంగా..సాధారణం కన్నా..12 నుంచి 14 శాతం వరకు మెలైజీ కూడా అదనంగా వస్తుదంటున్నారు.

దేశ వ్యాప్తంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు భారత్ స్టేజ్ (BS-6) పెట్రోల్, డీజిల్‌ను కేంద్ర ప్రభుత్వం తాజాగా ముందుకు తీసుకొచ్చింది.
శుద్ధి చేసిన ఈ చమురు ఏప్రిల్ 01వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాల్లోని వాహనదారులకు అందుబాటులోకి రానుంది.
దీనితో సల్ఫర్ పరిణామం పది శాతమే ఉంటుంది.

ప్రస్తుతం వినియోగిస్తున్న BS -4 ఇంధనంలో సల్ఫర్ 50 శాతం వరకు ఉండడంతో వాహనాల నుంచి భారీగా కాలుష్యం గాలిలోకి వెలువడుతుంది.
బీఎస్ – 6 వాహనాలకు అనుగుణంగా..బైక్ ఇంజిన్లలో మార్పులు చేశారు.
ట్యాంకు నుంచి పెట్రోల్ నేరుగా ఇంజిన్‌కు చేరేలా తీర్చిదిద్దారు.
అంటే..వాహన ట్యాంకులో కనీసం లీటర్ పెట్రోల్ ఉండాలి.

News 9

Related post