2020 లో 33 వేల కోట్లు అప్పు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం : బడ్జెట్ లో వెల్లడించిన మంత్రి హరీష్ రావు

 2020 లో 33 వేల కోట్లు అప్పు చేయనున్న తెలంగాణ ప్రభుత్వం : బడ్జెట్ లో వెల్లడించిన మంత్రి  హరీష్ రావు

తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శాసనసభలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టారు. రానున్న ఏడాదిలో రూ. 1,82,914.42 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ.22,061.18 కోట్లు. రెవెన్యూ మిగులు రూ. 4,482.12 కోట్లు. ఆర్థిక లోటు రూ.33,191.25 కోట్లు.
వివిధ రంగాలకు కేటాయింపులు : 

రైతు బంధు – 14,000 కోట్లు

రైతు బీమా – 1,141 కోట్లు

రైతు రుణమాఫీ – 6,225 కోట్లు

సకాలంలో విత్తనాలు, ఎరువులు – 142 కోట్లు

మైక్రో ఇరిగేషన్ – 600 కోట్లు

రైతు వేదికలు – 350 కోట్లు

పాడి పరిశ్రమ – 100 కోట్లు

సాగునీటి రంగం – 11,054 కోట్లు

ఆసరా పెన్షన్లు – 11,758 కోట్లు

ఎస్సీల ప్రత్యేక ప్రగతి నిధి – 16,534.97 కోట్లు

ఎస్టీల ప్రత్యేక ప్రగతి నిధి – 9,771.27 కోట్లు

మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం – 1,518.06 కోట్లు

పశుపోషణ, మత్స్యశాఖ – 1,586.38 కోట్లు

కళ్యాణలక్ష్మి-బీసీల కోసం అదనపు నిధులు – 1,350 కోట్లు

ఎంబీసీ కార్పొరేషన్ – 100 కోట్లు

మొత్తంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం – 4,356.82 కోట్లు

మహిళా స్వయం సహకార సంఘాలకు వడ్డీలేని రుణాలకు – 1,200 కోట్లు

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి – 23,005 కోట్లు

మున్సిపల్, పట్టణాభివృద్ధి – 14,809 కోట్లు

హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధి, మూసీనది ప్రక్షాళన, మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అమలు – 10,000 కోట్లు

ఫీజు రీయంబర్స్‌మెంట్ – 2,650 కోట్లు

పాఠశాల విద్య – 10,421 కోట్లు

ఉన్నత విద్య – 1,723.27 కోట్లు

వైద్యం – 6,186 కోట్లు

విద్యుత్ – 10,416 కోట్లు

పరిశ్రమల అభివృద్ధి – 1,998 కోట్లు

ఆర్టీసీ – 1,000 కోట్లు

గృహ నిర్మాణం – 11,917 కోట్లు

పర్యావరణం, అటవీ శాఖ – 791 కోట్లు

దేవాలయాల అభివృద్ధి – 500 కోట్లు

ధూపదీప నైవేద్యాలు, దేవాలయాల నిర్వహణ – 50 కోట్లు

మొత్తంగా రవాణా, రోడ్లు భవనాల శాఖ – 3,494 కోట్లు

పోలీస్ శాఖ – 5,852 కోట్లు

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఎస్‌డీపీ నిధులు – 480 కోట్లు

News 9

Related post