మనీలాండరింగ్‌ చట్టం కింద యెస్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ అరెస్టు

 మనీలాండరింగ్‌ చట్టం కింద యెస్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ అరెస్టు

యెస్‌బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణాకపూర్‌ను నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కస్టడీకి అప్పగించారు. మార్చి 11వ తేదీ వరకు ఈ కస్టడీ కొనసాగుతుంది. ఈ విషయాన్ని ముంబయి కోర్టు ప్రకటించింది. కపూర్‌ను ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ చట్టం కింద అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన దర్యాప్తుకు సహకరించడంలేదని అధికారులు అంతుకు ముందు వెల్లడించారు. కపూర్‌ను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా మార్చుకొన్నారని ఆయన లాయర్‌ వాదించారు. సంక్షోభంలో కూరుకుపోయిన యెస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఆదివారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బ్యాంకులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల కింద గత రెండు రోజులుగా ఆయన్ని అధికారులు విచారిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం ముంబయిలోని ఆయన నివాసంలో సోదాలు జరిపారు. అనంతరం విచారణ నిమిత్తం ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు. దాదాపు 20 గంటల పాటు ప్రశ్నించిన తర్వాత ఆదివారం వేకువజామున కపూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సహకరించని కారణంగానే అరెస్టు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సహా మరో కార్పొరేటు సంస్థలకు ఇచ్చిన రుణాల విషయంలో కపూర్‌ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. యెస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోవడానికి దారితీసిన మరికొన్ని అవకతవకల్లోనూ ఆయన పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

News 9

Related post