క్రీడా రంగం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న కరోనా వైరస్

 క్రీడా రంగం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్న కరోనా వైరస్

ప్రపంచ వ్యాప్తంగా ఆరంభం కావాల్సిన ఇరానీ కప్‌తో పాటు సీనియర్‌ వుమెన్స్‌ వన్డే నాకౌట్‌ టోర్నీ, విజ్జీ ట్రోఫీ, సీనియర్‌ వుమెన్స్‌ వన్డే చాలెంజర్‌, వుమెన్స్‌ అండర్‌-19 వన్డే నాకౌట్‌, వుమెన్స్‌ అండర్‌-19 టీ20 లీగ్‌ ఇలా అన్ని టోర్నీలను బీసీసీఐ వాయిదా వేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ వీటి వాయిదా కొనసాగనుంది. ఈ మేరకు బీసీసీఐ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.శుక్రవారం ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. మార్చి 29వ తేదీన ఆరంభం కావాల్సిన ఐపీఎల్‌ను ఏప్రిల్‌ 15కు వాయిదా వేసింది. కరోనాను మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరిన్ని కఠిన చర్యలకు ఉపక్రమించింది.ఏప్రిల్‌ 15 వరకు విదేశీయులకు వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంతో విదేశీ క్రికెటర్లు అప్పటివరకూ ఐపీఎల్‌ ఆడటానికి భారత్‌కు వచ్చే చాన్స్‌ లేకుండా పోయింది. మరొకవైపు పలు రాష్టాలు కూడా ఐపీఎల్‌ నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఐపీఎల్‌ వాయిదా పడింది. అదే సమయంలో దేశవాళీ టోర్నీలతో పాటు భారత్‌ ఆడాల్సిన పలు టోర్నీలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఒకవేళ ఇదే అనిశ్చితి ఉంటే మాత్రం​ ఆ లీగ్‌ జరగకపోయినా ఆశ్చర్యపడనక్కర్లేదు. కరోనా వైరస్‌ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉండటంతో ఐపీఎల్‌ను వేరే దేశాల్లోనే తటస్థ వేదికల్లో నిర్వహించే మార్గాలు కూడా లేవు. దీనికి కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టడమే ఒక్కటే మార్గం.పలు దేశాల క్రికెట్ బోర్డులు ఇప్పటికే తమ దేశాల్లో జరగాల్సిన క్రికెట్ మ్యాచ్‌లను రద్దు చేసుకోవడం తెలిసిందే.

News 9

Related post