కరోనా దెబ్బకి .. సమస్యల మీద సమస్యలు ఎదుర్కొంటున్న రాజమౌళి టీమ్

 కరోనా  దెబ్బకి .. సమస్యల మీద సమస్యలు ఎదుర్కొంటున్న రాజమౌళి టీమ్

కరోనా దెబ్బకి .. సమస్యల మీద సమస్యలు ఎదుర్కొంటున్న రాజమౌళి టీమ్: రాజమౌళి కొంత గ్యాప్ తీసుకుని పూనా లో కనిపించే అలనాటి బ్రిటీష్ కాలాన్ని ప్రతిబింబించే కొన్ని భవంతులను సెట్ చేసుకని అక్కడ కొన్ని వేలమంది మధ్య అల్లూరి సీతారామరాజు పాత్రను చేస్తున్న రామ్ చరణ్ పై కొన్ని యాక్షన్ సీన్స్ ను తీయాలని షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా భయంతో జనం విపరీతంగా గుమికూడే ఫంక్షన్స్ ఆఖరికి పెళ్ళిళ్ళు కూడ క్యాన్సిల్ చేసిన పరిస్థుతులలో ఇప్పుడు పూనా లో రాజమౌళికి షూటింగ్ నిమిత్తం ఇచ్చిన పర్మిషన్స్ రద్దు అయ్యాయి అని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో బ్రిటీష్ సైనికులు లా నటించడానికి కొందరు నిజమైన బ్రిటన్ దేశానికి చెందిన చిన్న నటీనటులను రాజమౌళి ఎంపిక చేసాడు. ఇప్పుడు విదేశాల నుండి ఇండియాకు వచ్చే వారికి వీసా సమస్యలు ఏర్పడటంతో రాజమౌళి ప్లాన్ ప్రకారం ఆ బ్రిటీష్ ఎక్స్ ట్రా ఆర్టిస్టులు ఇప్పట్లో వచ్చే ఆస్కారం లేదు అని అంటున్నారు.

News 9

Related post