వైసిపి వైఖరిపై కేంద్రానికి లేఖ రాస్తా ; జనసేన అధినేత పవన్ కళ్యాణ్

 వైసిపి వైఖరిపై కేంద్రానికి లేఖ రాస్తా ; జనసేన అధినేత పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నామినేషన్ నేపథ్యంలో జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తా. వైసీపీ నేతల దాడులకు సంబంధించిన వీడియోలు, ఆడియోలు అమిత్ షాకు అందజేస్తా అని జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు . . జనసేన మహిళా నేతలపై దాడుల చేస్తే వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నామినేషన్ల ప్రక్రియలో హింసాత్మక ఘటనలు జరిగాయి. 13 జిల్లాలో వైసీపీ దౌర్జన్యానికి పాల్పడింది. ఎన్నికల అధికారులపై కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా. కేంద్రానికి లేఖలు రాయడమే కాకుండా స్వయంగా నేను వెళ్లి కేంద్ర పెద్దలను కలుస్తా” అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అంతేకాకుండా, ‘ఏయే అధికారి ఏయే తప్పులు చేశారన్న విషయాలను కూడా బయట పెడతాం. వైసీపీ అధికారంలో ఉందని, సులువుగా తప్పించుకోవచ్చని భావించి ఇటువంటి చర్యలకు పాల్పడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుర్తు పెట్టుకోండి మిమ్మల్ని ఎవరూ వదిలిపెట్టరు’ అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

News 9

Related post