ఎన్నికల వాయిదా విషయంలో సుప్రీంకు వెళ్లనున్న జగన్ సర్కార్

 ఎన్నికల వాయిదా విషయంలో సుప్రీంకు వెళ్లనున్న జగన్ సర్కార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక ఎన్నికల వాయిదా జరిగింది , ఈ విషయంపై పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని  జగన్‌ సర్కారు నిర్ణయించింది. ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగేందుకు ఆదేశాలివ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేయనుంది. ఎస్‌ఈసీ నిర్ణయం వల్ల రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని పిటీషన్‌లో పేర్కొనుంది. కరోనా వైరస్‌ ప్రభావంపై హెల్త్‌ సెక్రటరీతోగాని, చీఫ్‌ సెక్రటరీతో గాని సమీక్ష, సంప్రదింపులు లేకుండా నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టుకు నివేదించనన్నారు. కరోనా లాంటి వ్యాధులను నివారణలో స్థానిక సంస్థల పాత్ర కీలకమని సుప్రీం కోర్టుకు తెలపనుంది ఏపీ సర్కారు. మరోవైపు.. ఈసీ రమేష్‌ కుమార్‌ వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం జగన్‌.. కేంద్రం, సీఈసీకీ ఫిర్యాదు చేయనుంది. రమేష్ కుమార్‌పై పార్టీ పరంగా కాకుండా.. ప్రభుత్వ పరంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. టీడీపీకి అనుకూలంగా రమేష్ కుమార్‌ వ్యవహరించారంటూ ఆరోపిస్తున్న జగన్‌ సర్కారు.. కరోనా పేరిట ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారనే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లనుంది ఏపీ సర్కారు.

News 9

Related post