సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు

 సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నియమాలు అన్ని పార్టీలకు ఒకేలా ఉంటాయని, పులివెందుల మార్క్‌ రాజకీయం కుదరుదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్లు వేయకుండా 2130 చోట్ల ఏకగ్రీవాలు చేసుకున్నారని విమర్శించారు.పారామిలిటరీ బలగాలతో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర పోలీసులు అన్‌ఫిట్‌ అని చంద్రబాబు విమర్శించారు. ఇప్పుడున్న ఎన్నికల కమిషనర్‌ను తాను నియమించలేదని, అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ రికమెండేషన్‌తో ఎన్నికల కమిషన్‌ నియామకం జరిగిందని చంద్రబాబు అన్నారు. ఎన్నికల కోడ్ సరిగా అమలు కావడం లేదని, టీడీపీ నేతలకు భద్రత కల్పించడం లేదని మండిపడ్డారు. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తున్నారని, జైల్లో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆరు రాష్ట్రాల్లో షట్‌డౌన్ చేశారని, కరోనాపై జగన్‌ ఒక్క రోజు కూడా సమీక్ష చేయలేదన్నారు. 60 ఏళ్ల వాళ్లకే కరోనా వస్తుందని చెబుతారా? అని చంద్రబాబు మండిపడ్డారు. కరోనా వస్తే పారాసిటమాల్‌ వేస్తే తగ్గిపోతుందంటున్నారని, మీ చేతగానితనానికి ఇదే నిదర్శనమని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల ప్రాణాలంటే లెక్క లేని తనమని చంద్రబాబు విమర్శించారు.

News 9

Related post