కరోనా వైరస్ వల్ల 21 ఏళ్ల స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ మృతి

 కరోనా వైరస్ వల్ల 21 ఏళ్ల స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ మృతి

కరోనా భారిన పడి ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ మరణించాడు. 21 ఏళ్ల స్పానిష్ ఫుట్‌బాల్ కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా మాలాగాలో కరోనా కారణంగా మరణించాడు. అయితే తీవ్రమైన కరోనావైరస్ లక్షణాలతో ఆసుపత్రికి వెళ్లిన తరువాత గార్సియా కు లుకేమియా కూడా ఉన్నట్టుగా నిర్ధారించారు వైద్యులు. అయితే ఈ యువ కోచ్ మరణం గురించి అట్లెటికో పోర్టాడా ఆల్టా సోషల్ మీడియాలో ఎమోషనల్ స్టేట్మెంట్ విడుదల చేసింది. అందులో ”అట్లెటికో కోటాడా ఆల్టా నుండి, మమ్మల్ని విడిచిపెట్టిన మా కోచ్ ఫ్రాన్సిస్కో గార్సియా యొక్క కుటుంబానికి, స్నేహితులకు మరియు బంధువులకు మా ప్రగాడ సంతాపాన్ని తెలియజేయాలనుకుంటున్నాము… మరియు ఇప్పుడు మీరు లేకుండా మేము ఏం చేస్తాము, ఫ్రాన్సిస్? లీగ్‌లో గెలవడం ఎలాగో మాకు తెలియదు, కాని మేము మీ కోసం దానిని సాధిస్తాము. మేము నిన్ను మరచిపోలేము ఇక విశ్రాంతి తీసుకోండి ఎప్పటికీ ” అని అన్నారు.

News 9

Related post