2020 ప్రపంచ కప్ జట్టులో ధోనీకి చోటులేదు : వీరేంద్ర సెహ్వాగ్‌

 2020 ప్రపంచ కప్ జట్టులో ధోనీకి చోటులేదు : వీరేంద్ర సెహ్వాగ్‌

టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌  ధోనీకి 2020 ప్రపంచ కప్ జట్టులో చోటెక్కడుంది అని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అంటున్నాడు. ధోనీ టీమిండియాలోకి మళ్లీ పునరాగమనం చేయడం ఇక కష్టమే అని అభిప్రాయపడ్డాడు. రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌ వికెట్‌ కీపింగ్‌, బ్యాటింగ్‌లో రాణిస్తున్నారని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ధోనీ, సెహ్వాగ్‌ల మధ్య విభేదాలు ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మహీ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశాడు. ధోనీ సారథ్యంలోనే 2011 ప్రపంచకప్‌లో సెహ్వాగ్ ఆడాడు. ఈ విషయంపై పలువురు పలు రకాలుగా స్పందిస్తున్నారు . ధోని 2020 ప్రపంచ కప్ ఆడాల్సిందే అని అభిమానులు ట్విట్టర్ వేదికగా  కోరుకుంటున్నారు 

News 9

Related post