మార్చి 19 నుంచి మార్చి 22 వరకు మరోసారి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్

 మార్చి 19 నుంచి మార్చి 22 వరకు  మరోసారి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్

భారత దేశ వ్యాప్తంగా మార్చి 19 నుంచి మార్చి 22 వరకు  మరోసారి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్  జరుగనున్నాయి . ఫ్లిప్‌కార్ట్ స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్స్ ప్రకటించింది. . ఎస్‌బీఐ  కార్డులతో ట్రాన్సాక్షన్స్ చేసేవారికి 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందొచ్చు. కొన్ని ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

– సాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అందులో సాంసంగ్ గెలాక్సీ ఏ50 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.14,999 కాగా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌లో రూ.12,999కు లభిస్తుంది.

– ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వరుసగా కొత్త ఫోన్స్ తీసుకొస్తున్న రియల్‌మీ.. ఇటీవల `రియల్‌మీ ఎక్స్‌2` విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే రియల్‌మీ ఎక్స్2 స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.16,999 కాగా ఆఫర్ ధర రూ.14,999కు లభిస్తుంది.

– ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.36,990. ప్రీపెయిడ్‌పై రూ.12,000 తగ్గింపు లభిస్తుంది. అంటే ఈ ఫోన్ రూ.24,990 ధరకే కొనొచ్చు.

– చైనాకు చెందిన మొబైల్‌ తయారీదారు వివో తన జెడ్‌ సిరీస్‌లో ఇటీవల కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. వివో జెడ్ 1 ఎక్స్ పేరుతో భారతదేశంలో ప్రారంభించింది. అయితే వివో జెడ్1 ఎక్స్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,990 కాగా ఆఫర్ ధర రూ.13,990కే లభిస్తుంది.

– రియల్‌మీ ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ వేరియంట్ అసలు ధర రూ.15,999 కాగా ఆఫర్ ధర రూ.14,999కు పొందొచ్చు. మరియు రియల్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.8,999 కాగా ఆఫర్ ధర రూ.8,499 కు పొందొచ్చు.

News 9

Related post