మహేష్ , ప్రభాస్ , ఎన్టీఆర్ లని వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానాన్ని సాధించిన “విజయ్ దేవర కొండ”

 మహేష్ , ప్రభాస్ , ఎన్టీఆర్ లని వెనక్కి నెట్టి నంబర్ 1 స్థానాన్ని సాధించిన “విజయ్ దేవర కొండ”

Vijay Devarakonda, Mehreen Pirzada And Others At The NOTA Press Meet

హైదరాబాద్ : ప్రతిష్టాత్మక హైదరాబాద్ టైమ్స్ ఏటా వెల్లడి చేసే తెలుగు  డిజైరబుల్ మెన్ జాబితాలో ఈ సారి పెను మార్పులు వచ్చాయి . టాప్ హీరోలు రెండెంకల స్థానాలొక్కి పడిపోయారు . ఎన్టీఆర్ , మహేష్ బాబులు  రెండెంకల స్థానాలలో నిలిచారు . వివరాలలోకి వెళ్తే  2018లో హైదరాబాద్ టైమ్స్ ‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ గా నిలిచిన విజయ్ దేవరకొండ.. ఈ ఏడాది కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. 2019 సంవత్సరానికిగాను హైదరాబాద్ టైమ్స్ ‘మోస్ట్ డిజైరబుల్ మెన్’ జాబితాలో విజయ్ దేవరకొండ తొలి స్థానంలో నిలిచాడు. వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్నప్పటికీ విజయ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని దీంతో నిరూపితం అయింది. ఈ జాబితాలో మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ రెండో స్థానంలో నిలిచాడు. గతేడాది మూడో స్థానంలో ఉన్న చెర్రీ ఈ ఏడాది తన స్థానాన్ని మెరుపరుచుకున్నాడు. ఇక, 3,4 స్థానాల్లో వరుసగా రామ్ పోతినేని, ప్రభాస్ నిలిచారు. గతేడాది రెండో స్థానంలో ఉన్న ప్రభాస్ ఈసారి 4వ స్థానానికి పడిపోయాడు. ఇంకా టాప్ 10లో మెగా హీరో వరుణ్ తేజ్, సుధీర్ బాబు, యాంకర్ ప్రదీప్‌ ఉన్నారు. యంగ్ టైగర్ ఎన్టీయార్ 19వ స్థానంలో నిలిచాడు.

News 9

Related post