ఎపి సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

 ఎపి సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ట్విట్టర్ వేదికగా పలు  విమర్శలుచేసారు . జగన్ మొండి వైఖరి రాష్ట్రానికి శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని ప్రతి రాష్ట్రం కరోనా నియంత్రణ చర్యలు చేపడుతుంటే.. జగన్‌ మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాఠశాలను మూసివేశారని.. రద్దీ ప్రాంతాలను నివారిస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం ఈ చర్యలు లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఇప్పటికైనా తన అధికార దాహాన్ని వీడి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని విజ్ఙప్తి చేశారు లోకేష్.

News 9

Related post