ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత

 ఎట్టకేలకు ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కల్వకుంట్ల కవిత

నిజామాబాద్ ఎంపీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని పొందిన సీఎం కేసీఆర్ కూతురు / వారసురాలు ఇన్నిరోజులు ఏ పదవి లేకుండా కాలం గడిపింది . ఎట్టకేలకు ఇప్పుడు  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీ ఉపఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో రిటర్నింగ్ ఆఫీసర్ కు కవిత తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. 2015లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి… ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో, ఖాళీ అయిన ఈ స్థానానికి ఉపఎన్నిక జరుగుతోంది. 2022 జనవరి 4 వరకు ఈ ఎమ్మెల్సీ స్థానానికి పదవీకాలం ఉంది. ఎమ్మెల్సీ స్థానం కోసం కాంగ్రెస్‌, బీజేపీ ఎన్నికల బరిలో ఉన్నప్పటీకి, టిఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కవిత గెలుస్తారని టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఎన్నిక అనివార్యమైతే ఏప్రిల్‌ 7వ తేదీన పోలింగ్ నిర్వహించి 9న ఓట్ల లెక్కింపు చేపడతారు.

News 9

Related post