పవర్ స్టార్ “వకీల్ సాబ్” సినిమా విడుదల లో జాప్యం

 పవర్ స్టార్  “వకీల్ సాబ్” సినిమా విడుదల లో జాప్యం

పవన్ కళ్యాణ్ తన కమ్ బ్యాక్ మూవీగా హిందీ చిత్రం ‘పింక్’ రీమేక్ ని ఎంచుకున్న విషయం తెలిసిందే. పవర్ స్టార్ 26వ చిత్రంగా తెరకెక్కుతున్న’వకీల్ షాబ్’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోనీకపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఈ మధ్యే రిలీజై అందరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్ర బాధ్యతను డైరెక్టర్ క్రిష్ కు అప్పజెప్పాడు. పీరియాడికల్ ఈ చిత్రాన్ని బడా నిర్మాత ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో నిర్మాతలు చిత్ర నిర్మాణాలను ఆపేసిన విషయం తెలిసిందే. దీని కారణంగా మే నెలలో విడుదల కావాల్సిన ‘వకీల్ షాబ్’ చిత్రీకరణ పూర్తి కాకపోవడంతో ఇప్పుడిప్పుడే విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. వకీల్ సాబ్ను సకాలంలో పూర్తి చేయాలని నిశ్చయించుకున్న పవర్ స్టార్ తన మిగతా చిత్రాల చిత్రీకరణకు బ్రేక్ వేయాలని డిసైడ్ అయ్యారంట. మొదట వకీల్ సాబ్ చిత్రీకరణను ముగించి తర్వాత వారి చిత్రాన్ని ప్రారంభించమని చిత్ర దర్శకుడు క్రిష్ మరియు నిర్మాత ఏ.ఎమ్.రత్నాన్ని కోరినట్లు తెలిసింది. ఈ చిత్రం ద్వారా తన పూర్వ వైభవాన్ని పొందాలని అభిమానులు కోరుకుంటున్నారు.

News 9

Related post