ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో కరోనా వైరస్ కట్టడికి ప్రత్యేక నోడల్ అధికారులు

 ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో కరోనా వైరస్ కట్టడికి ప్రత్యేక నోడల్ అధికారులు

ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాలలో కరోనా వైరస్ కట్టడికి ప్రత్యేక నోడల్ అధికారులు.. వివరాలలోకి వెళ్తే  తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ – 19(కరోనా వైరస్) భారీగా ప్రభలుతుండటంతో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే వైరస్ నివారణ చర్యలకు సంబంధిత అంశాల పర్యవేక్షణకు రెండు రాష్ట్రాలకు నోడల్ అధికారులను నియమించింది. ఏపీ నోడల్ అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఎస్. సురేష్ కుమార్‌ను నియమించగా.. తెలంగాణకు సంజయ్ జాజును ప్రత్యేక నోడల్ అధికారిగా నియమించింది. కాగా, ఏపీలో రెండు కరోనా కేసులు.. తెలంగాణలో 13 కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 166కు చేరుకుంది.

News 9

Related post