కరోనా వైరస్ కట్టడికి కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం

 కరోనా వైరస్ కట్టడికి  కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ అత్యవసర సమావేశం

కరోనా వైరస్ కట్టడికి  మధ్యాహ్నాం 2 గంటలకు ప్రగతిభవన్‌లో  కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం అత్యవసర సమావేశం  నిర్వహిస్తారు. సమీక్ష సమావేశానికి మంత్రులు సహా 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు హాజరవుతారు. ఇండోనేషియా నుంచి కరీంనగర్ వచ్చిన వచ్చిన విదేశీయులకు కరోనా లక్షణాలు ఉన్నట్టు తెలియడంతో అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు కరీంనగర్ కలెక్టరేట్ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రజలు బయటకు రావొద్దని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి చేరింది. బుధవారం ఒక్కరోజు 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. విదేశాల నుంచి వస్తోన్న వారితోనే కరోనా వైరస్ సోకుతుండటంతో.. నియంత్రణ చర్యలు మరింత పకడ్బందీగా తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టంచేసే అవకాశం ఉంది.

News 9

Related post