ఆంధ్రప్రదేశ్ లో యధాతధంగా ఉగాది పర్వదినం నాడే ఇళ్ల పట్టాలు పంపిణీ : వైసీపీ కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి

 ఆంధ్రప్రదేశ్ లో యధాతధంగా ఉగాది పర్వదినం నాడే ఇళ్ల పట్టాలు పంపిణీ : వైసీపీ కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామి

ఆంధ్ర ప్రదేశ్ లో  ఈ నెల 25న ఉగాది రోజునే  ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రాష్ట్ర వ్యాప్తంగా  అమలు చేయతలపెట్టిన  ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని విజయనగరం నియోజకవర్గంలో చేయనున్నట్టు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. బుధవారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ సమావేశంలో  ఆయన మాట్లాడారు.  స్థానిక సంస్థల ఎన్నికల  నేపథ్యంలో ఉగాది రోజు ఇళ్ల పట్టాలు పంపిణీ జరగదని భావించినప్పటికీ  ఎన్నికలు వాయిదా నేపథ్యంలో సుప్రీం కోర్టు కోడ్‌ అమలును ఎత్తివేయాలంటూ తీర్పునివ్వటాన్ని స్వాగతిస్తున్నామన్నారు.  ఎన్నికల కోడ్‌ ఎత్తివేయటంతో  రాష్ట్రంలో జిల్లాలో సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి  పనులకు శంకుస్థాపనలకు అవకాశం ఉంటుందన్నారు. మరల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమకు అభ్యంతరం లేదని, స్థానిక సంస్థల  ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు మిన్నగా అధిక స్థానాలు కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం మాదిరిలా కాకుండా లంచగొండితనానికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. నియోజకవర్గంలో రేపటి నుంచి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. నగరంలో మంచి నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టామని పలు ప్రాంతాల్లో  వేధిస్తున్న సమస్యలను  పరిష్కరించేందుకు  చర్యలు చేపడతామన్నారు.

News 9

Related post