కరోనా వైరస్ పై టెస్ట్ క్రికెట్ పద్దతితో పోటీ చేయాలి : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్

 కరోనా వైరస్ పై టెస్ట్ క్రికెట్ పద్దతితో పోటీ చేయాలి : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్

కరొనా వైరస్ ఇండియా లో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖులు వారి సలహాలు అందిస్తున్నారు .  కరోనా  వ్యాప్తిని నిరోధించే క్రమంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కరోనాను టెస్ట్‌ క్రికెట్‌తో పోలుస్తూ కీలక సూచనలు ఇచ్చారు. టెస్ట్ క్రికెట్ ఆడాలంటే ఎంతో సహనం, టీమ్ వర్క్ ఉండాలని. డిఫెన్స్ ఎంతో ముఖ్యమని చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ పత్రికకు రాసిన కాలమ్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మనకు అర్థంకాని, అంతుచిక్కని దాన్ని గౌరవించడమనేది టెస్ట్ క్రికెట్లో ఒక ప్రధాన అంశమని సచిన్ చెప్పారు. ముఖ్యంగా సహనం అనేది టెస్ట్ క్రికెట్లో కీలకమని తెలిపాడు. పిచ్ పరిస్థితులు కానీ, బౌలర్ విసిరే బంతులు కానీ మనం అర్థం కానప్పుడు. డిఫెన్స్ అనేదే బెస్ట్ అటాక్ అని చెప్పారు. మనం ఎంత డిఫెన్స్ ఆడితే. ఆటపై అంత పట్టును సాధించవచ్చని తెలిపారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో. ప్రస్తుతం మనకు అదే సహనం అవసరమని సూచించాడు. కరోనాను కూడా మనం టెస్ట్ మ్యాచుల్లో మాదిరే డిఫెన్స్ తో ఎదుర్కొందామని చెప్పారు. కరోనాను అన్ని దేశాలు కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నారు.

News 9

Related post