గూగుల్ పే తో సైబర్ నేరగాళ్ల కొత్త మోసం : అకౌంట్ లో డబ్బులు ఖతం

 గూగుల్ పే తో సైబర్ నేరగాళ్ల కొత్త మోసం : అకౌంట్ లో డబ్బులు ఖతం

సైబర్ నేరగాళ్లు కొత్త టెక్నీక్ లతో భారీ మోసాలు . వివరాలలోకి వెళ్తే యూసఫ్ గూడ ప్రాంతంలో కానిస్టేబుల్ గా పని చేసే ఒక యువతికి ఆంధ్రా బ్యాంక్ తో పాటు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాలు ఉన్నాయి. గూగుల్ పే లో ఆంధ్రా బ్యాంక్ అకౌంట్ ను ఆమె లింక్ చేసుకున్నారు. ఆ అకౌంట్ కు బెనిఫిషియరీగా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా జత చేసుకున్నారు. గత నెలలో ఆంధ్ర బ్యాంకులో ఉన్న 90,000 రూపాయల నగదును బదిలీ చేశారు. నగదు మాయం కావడంతో పోలీసులను ఆశ్రయించగా గూగుల్ పే ద్వారా యువతి మోసపోయిందని తేలింది. సైబర్ మోసగాళ్లు యువతి బేనిఫిషియరీ ఖాతాలో బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాను డిలేట్ చేసి వారి ఎస్బీఐ ఖాతాను యాడ్ చేశారు. ఈ విషయం తెలియని యువతి ఎస్బీఐ ఖాతాకు 90,000 రూపాయలు బదిలీ చేసింది. యువతి డిపాజిట్ చేసిన ఖాతా డమ్మీ అకౌంట్ అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News 9

Related post