కరోనా వైరస్ దాటికి ఆగిపోయిన హీరో వెంకటేష్ సినిమా “నారప్ప”

 కరోనా వైరస్ దాటికి ఆగిపోయిన హీరో వెంకటేష్ సినిమా “నారప్ప”

తెలుగులో నారప్ప పేరుతో హీరో వెంకటేష్  చిత్రం తెరకెక్కుతోంది. విభిన్నమైన గెటప్ తో .. విలక్షణమైన బాడీ లాంగ్వేజ్ తో ఈ సినిమాలో నటుడు వెంకటేశ్ కనిపించనున్నాడు. జనవరిలో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఇంతవరకూ జరిపిన 56 రోజుల షూటింగుతో 70 శాతం చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. కేరళలో షూటింగు జరుగుతుండగా కరోనా గురించిన వార్తలు తీవ్రతరం కావడంతో, నాలుగు రోజుల పాటు షూటింగు మిగిలి ఉండగానే ఈ సినిమా టీమ్ వెనుదిరిగింది. పీటర్ హెయిన్స్ డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయట. వెంకటేశ్ సరసన ఒక హీరోయిన్ గా ప్రియమణి నటిస్తుండగా.. మరో హీరోయిన్ గా రెబ్బా మోనికా జాన్ కనిపించనుంది. ఈ మూవీని శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్నాడు.

News 9

Related post