తెలంగాణ సీఎం నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించిన పలు విషయాలు వెల్లడి

 తెలంగాణ సీఎం నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించిన పలు విషయాలు వెల్లడి

తెలంగాణ సీఎం నిన్న నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించిన పలు విషయాలు వెల్లడి చేసారు .  గురువారం ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2,500 కేంద్రాల్లో ఇవి జరుగుతున్నాయని తెలిపారు. ఆయా కేంద్రాల్లో హై శానిటేషన్‌ చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,165 మందిని హోం క్వారంటైన్‌ చేశామనీ, వారిపై నిత్యం పర్యవేక్షణ కొనసాగుతుందని వివరించారు. కరోనా వైరస్‌ సోకిన 14 మందిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వెల్లడించారు. ఈ వైరస్‌ను గుర్తించేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు స్క్రీనింగ్‌ సెంటర్లు ఉండగా, సీసీఎంబీలో కూడా స్క్రీనింగ్‌ సెంటర్‌ నిర్వహించాలంటూ ప్రధానిని కోరతామని తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే వారి ద్వారానే కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విదేశీ విమాన సర్వీసులను తక్షణమే నిలిపివేయాలంటూ కేసీఆర్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఇదే విషయాన్ని శుక్రవారం ముఖ్యమంత్రులతో నిర్వహించబోయే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళతానని అన్నారు. కరోనాకు సంబంధించి స్వీయ నియంత్రణ, స్వీయ క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతే శ్రీరామరక్ష అని వ్యాఖ్యానించారు. ఇందుకనుగుణంగా ప్రభుత్వ సూచనలు, అధికారుల సలహాలను పాటించి రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటూ సీఎం… ప్రజలకు పిలుపునిచ్చారు. ఉగాది పర్వదినాన పంచాగ శ్రవణాలను కూడా ఎట్టి పరిస్థితిల్లోనూ అనుమతించబోమని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వాటిని టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తామనీ, ప్రజలు బయటకు వెళ్లకుండా ఇండ్లలో ఉండే వీక్షించవచ్చని వివరించారు. చెక్‌పోస్టుల జాబితా… 1) ఆదిలాబాద్‌, 2) వాంకిడి, 3) భైంసా, 4) కల్లూరు, 5) పాల్వంచ, 6) అశ్వారావుపేట, 7) నాగార్జునసాగర్‌, 8) విష్ణుపురం, 9) కోదాడ, 10) కృష్ణా, 11) ఆలంపూర్‌, 12), జహీరాబాద్‌, 13) సలూర, 14) మద్నూర్‌, 15) హైదరాబాద్‌- శ్రీశైలం రోడ్‌ (ఈగలపెంట), 16) హైదరాబాద్‌- భూపాలపట్నం (కొత్తూరు), 17) హైదరాబాద్‌-బీజాపూర్‌ (రావులపల్లి), 18) సిరోంచా-ఆత్మకూర్‌ (కాళేశ్వరం)

News 9

Related post