రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ తొలగిన గందరగోళం : స్పందించిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

 రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌ తొలగిన గందరగోళం : స్పందించిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రాణాలకు భద్రత లేదంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్‌ కుమార్‌.. కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై గందరగోళం తొలిగింది. ఆయన నుంచి లేఖ అందిన మాట నిజమే అన్నారు కేంద్రం హోం శాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి. వెంటనే ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో.. హోంశాఖ కార్యదర్శి మాట్లాడారని స్పష్టంచేశారు. ప్రస్తుతం రమేష్‌కుమార్‌ హైదరాబాద్‌లో ఉన్నారని చెప్పిన కిషన్‌ రెడ్డి.. ఆయన ఎప్పుడు హైదరాబాద్‌ వెళ్లినా పటిష్టమైన భద్రత కల్పిస్తారని చెప్పారు. అధికారులకు భద్రత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందన్నారు కిషన్‌ రెడ్డి. కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. దీనిపై ప్రభుత్వం భగ్గుమంది. జగన్ ఏకంగా ప్రెస్‌మీట్ పెట్టి రమేష్ కుమార్‌ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. SECకి కులాన్ని అంటగట్టి మాట్లాడారు. ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన రమేష్ కుమార్.. ప్రస్తుత పరిస్థితులు వివరిస్తూ కేంద్ర హోంశాఖకు రెండ్రోజుల కిందటే లేఖ రాసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఐతే.. ఈ లేఖ ఆయన రాసింది ఔనా కాదా.. అసలు మీడియాలో వచ్చిన లేఖ, కేంద్ర హోంశాఖకు అందిన లేఖ ఒకటేనా కాదా అనే దానిపై రకరకాల చర్చలు జరిగాయి. చివరికి ఇప్పుడు హోంశాఖ లేఖ వచ్చినట్టు ధృవీకరించడంతో కాస్త స్పష్టత వచ్చినట్టు అయ్యింది. SEC రమేష్ కుమార్‌కు పూర్తిస్థాయిలో సెక్యూరిటీ కల్పించడంపై ఏపీ ప్రభుత్వంతోనూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మాట్లాడారు. ఎస్‌ఈసీ లేఖపై అధికార పక్షంతో పాటు దొంగ మీడియా వితండవాదం చేసింది. అసలు ఎస్‌ఈసీ లేఖే రాయలేదంటూ దొంగ మీడియా గగ్గోలు పెట్టింది. లేఖ ప్రసారం చేసిన టీవీ5తో సాహా, ఇతర చానళ్లను పచ్చమీడియా అంటు దొంగమీడియా అరుపులు అరిచింది.

News 9

Related post