జపాన్ సరిహద్దులపై బాంబులు వేసిన ఉత్తర కొరియా

 జపాన్ సరిహద్దులపై బాంబులు వేసిన ఉత్తర కొరియా

ఉత్తరకొరియా అధ్యక్షుడి కిమ్ జాంగ్ ఉన్ మరో అనూహ్య చర్యకు పాల్పడ్డాడు. మిగతా దేశాలన్నీ కరోనా విలయంలో కొట్టుమిట్టాడుతుంటే.. తాము మాత్రమే భద్రంగా, బలంగా ఉన్నామనడానికి సంకేతంగా క్షిపణి పరీక్షలు నిర్వహించారు. చైనా సరిహద్దును ఆనుకుని ఉండే నార్త్ ప్యోంగ్యాన్ ఫ్రావిన్స్ భూభాగం నుంచి ఉత్తరకొరియా శుక్రవారం రెండు బాలిస్టిక్ మిస్సైళ్లను పేల్చిందని, తమ దేశంలో కరోనా లేదని చెప్పుకోడానికే కిమ్ ఈ ప్రయోగాలు జరిపించాడని సౌత్ కొరియా ఆర్మీ చీఫ్ ప్రపంచానికి వెల్లడించారు. జపాన్ అలజడి.. జపాన్ సరిహద్దులో అలజడి.. కిమ్ దేశం పేల్చిన రెండు బాలిస్టిక్ మిస్సైళ్లు.. సరిగ్గా తమ ప్రాదేశిక జలాల సరిహద్దు దగ్గరే పడ్డాయని జపాన్ అధికారులు తెలిపారు. ప్రపంచమంతా కరోనా భయంతో విలవిల్లాడుతోన్న ప్రస్తుత పరిస్థిలో కిమ్ చర్య ఖండనీయమని, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో జరిగిన శాంతి చర్చల్లో.. అణు, క్షిపణి పరీక్షలకు దూరంగా ఉంటానన్న మాటను కిమ్ ధిక్కరించారని జపాన్ మండిపడింది. 

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

News 9

Related post