తమ వినియోగదారులకు ఉచిత డాటా అందిస్తున్న బిఎస్ఎన్ఎల్

 తమ వినియోగదారులకు ఉచిత డాటా అందిస్తున్న బిఎస్ఎన్ఎల్

భారత్ లో  నానాటికి  ‘కరోనావైరస్’ని అరికట్టేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్న వివిధ విధానాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. దీన్ని ప్రోత్సహించడానికి బిఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్‌ని ప్రకటించినట్లు’.. బిఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సీఎఫ్‌ఏ వివేక్ బంజాల్ పేర్కొన్నారు. బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఉన్న, బ్రాండ్ బ్యాండ్ లేని దేశవ్యాప్తంగా ఉన్న పౌరులందరికీ ఈ సేవలను.. ఒక నెల రోజుల పాటు ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కాగా ఈ ప్లాన్ ద్వారా 10 ఎంబీపీఎస్ఎస్ డౌన్ స్పీడ్‌ను, 5 జీబీ డేటాను వినియోగదారులకు అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ సంస్థ. ఒకవేళ డేటా పరిమితి అయిపోతే.. డేటా వేగం కోసం 1 ఎంబీపీఎస్‌కు పరిమితమవుతుంది. ఈ కొత్త ఆఫర్ ద్వారా ఇంటి నుండి పని చేసుకోవడానికి, ఆన్‌లైన్ క్లాసెస్ ద్వారా విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగించవచ్చని బిఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ సీఎఫ్‌ఏ వివేక్ బంజాల్ తెలిపారు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

News 9

Related post