కరోనా వైరస్ నుండి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్

 కరోనా వైరస్ నుండి ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడానికి  ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్

కరోనా మహమ్మారి ప్రపంచాన్నివణికిస్తుంది . పదకొండున్ననర వేలమంది మృతి చెందగా, దాదాపు మూడు లక్షల మంది దీని బారిన పడ్డారు. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుంగిపోతోంది. ఈ మహమ్మారి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అధికారి ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు. ఐఎంఎఫ్ స్ట్రాటెజీ పాలసీ, రివ్యూ డిపార్టుమెంట్ హెడ్ మార్టిన్ ఈ వైరస్ విషయమై స్పందించారు. ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, ప్రధాన లక్ష్యం అదేనని అన్నారు. తద్వారా ప్రజలను కాపాడటంతో పాటు ఆర్థిక గందరగోళం కూడా పరిమితం చేయాలన్నారు. మార్కెట్లకు ద్రవ్యతను అందించేందుకు, వాటి పని తీరును కొనసాగించేందుకు కేంద్ర బ్యాంకులు తీసుకునే చర్యలు అద్భుతం అన్నారు. అయితే అలాంటి చర్యలు విషయంలో అంతర్జాతీయ తోడ్పాటు కూడా అవసరమన్నారు. కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. చైనా, ఇటలీ దేశాల్లో వేలాది మంది మృతి చెందారు. ఈ మహమ్మారి 185 దేశాలకు వ్యాప్తించింది. ఆయా దేశాలు కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాయి.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

News 9

Related post