షూటింగ్ లో బిజీగా ఉన్న ‘లవ్ స్టోరీ’ టీం : నాగ చైతన్య , శేఖర్ కమ్ముల , సాయి పల్లవి

 షూటింగ్ లో బిజీగా ఉన్న  ‘లవ్ స్టోరీ’ టీం : నాగ చైతన్య ,  శేఖర్ కమ్ముల , సాయి పల్లవి

అక్కినేని నట వారసుడు  నాగచైతన్య కధానాయకుడిగా గా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ చిత్రానికి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్ ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘ఫిదా’ లాంటి సెన్సేషనల్ హిట్ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని శేఖర్ కమ్ముల తీస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని ఎలాగైనా ఈ సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని శేఖర్ కమ్ముల భావిస్తున్నాడట. ఈ క్రమంలో కరోనాను పట్టించుకోకుండా ఆయన తన సినిమా షూటింగ్ ను కానిచ్చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మహబూబ్ నగర్ లో జరుగుతుండగా నాగ చైతన్య.. సాయి పల్లవిలపై చిత్రీకరణను కొనసాగిస్తున్నారు. అయితే కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకునే షూటింగ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ లోని ఒక సభ్యుడు తెలియజేసాడు.

( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )

News 9

Related post