Headlines

వేలాది మంది గిరిజనులపై కేసులు

ప్రస్తుతం తెలంగాణలో పోడు భూముల సమస్య చర్చనీయాంశం అయింది. పోడు భూములను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. తాజాగా ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు హత్యకు గురవడంపై ఆయన స్పందించారు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ హత్యే అని.. రాష్ట్ర ప్రభుత్వం చేతకానితనంతోనే ఒక అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. పోడు భూములపై హక్కులు కల్పిస్తామని దాదాపుగా గత ఎనిమిదేళ్ల నుంచి ప్రభుత్వం ఊరిస్తూ వస్తోంది. 2014 నుంచి ఇప్పటి వరకు పోడు భూములపై అతీగతీ లేదు.. అంటూ రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. వేలాది మంది గిరిజనులపై కేసులు పెట్టారని.

. పోడు భూములు సాగు చేస్తున్న రైతులు.. ఎన్ని పోరాటాలు చేసినా.. ఉద్యమాలు చేసినా ప్రభుత్వానికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేదని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి ఎన్నేళ్లు అవుతోంది.వేలాది మంది గిరిజనులపై కేసులు పెట్టారు ఇప్పటి వరకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదు. పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులు, అటవీ శాఖ అధికారుల మధ్య ఎందుకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. పోడు భూముల సమస్య పరిష్కారానికి కమిటీని కూడా నియమించారు కదా.. ఆ కమిటీ ఎందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి.. పోడు రైతులపై, పోడు భూములపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి మారాలని రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు. గుత్తికోయల దాడిలో అధికారి చనిపోవడం చాలా బాధాకరమైన ఘటన అని తెలిపారు.